March 9, 2026
Explore
పుంగనూరులో తెలుగుదేశం వర్గపోరు

పుంగనూరులో తెలుగుదేశం వర్గపోరు

March 9, 2026 | Andhra Pradesh

  • ఎమ్మెల్యే అమర్‌ బ్యానర్లు చించడంపై ఘర్షణ
  • కమిషనర్‌ పై మండిపడ్డ అమర్‌ గ్రూప్‌
  • మున్సిపాలిటిలో ఉద్రిక్తత

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరులో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంది. తెలుగుదేశం పలమనేరు సీనియర్‌ ఎమ్మెల్యే అమరనాథరెడ్డితో పాటు పిఎం, సిఎం, ఇతర మంత్రులతో కలసి గంగజాతర శుభాకాంక్షలు తెలుపుతూ కాపు సంఘ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ దేశాది ప్రకాష్‌ , మధుసూదన్‌రాయల్‌ బస్టాండ్‌లో బ్యానర్లు ఏర్పాటు చేశారు. సోమవారం దీనిని గమనించిన పుంగనూరు మరోవర్గం తమ్ముళ్ళు ప్రొటోకాల్‌తో వేసిన అమరనాథరెడ్డి బ్యానర్లను కమిషనర్‌తో కుమ్మకై పెరికించేశారు. దీనిపై అమరనాథరెడ్డి వర్గం నాయకులు సుబ్రమణ్యంరాజు, పర్వేజ్‌, అఫ్రోజ్‌, సయ్యద్‌, పరమేష్‌ తదితరులు మున్సిపాలిటికి చేరుకుని బయట వెళ్లిపోతున్న కమిషనర్‌ వాహనాన్ని అడ్డుకున్నారు. అమరనాథరెడ్డితో సహా పిఎం, సిఎం ఉన్న బ్యానర్లను ఎందుకు పెరికేశావ్‌ …? నీకు అధికారం ఎవరు ఇచ్చారు..? అలా అయితే పట్టణంలో కట్టిన బ్యానర్లు అన్ని పెరుకుతావా …అమరనాథరెడ్డి బ్యానర్లు కట్టిన ప్రతి సారి ఇలానే చించేస్తున్నారు….ఇక సహించేది లేదు….పుంగనూరు ఏవరబ్బ జాగీరుదారు కాదు… ఇలాంటివి చూస్తు ఊరుకోం అంటు ఒక్కసారిగా అమర్‌ వర్గం నాయకులు రెచ్చిపోయారు. కమిషనర్‌ కూడ తగ్గేది లేదంటు…. నా ఇష్టం అడగటానికి మీరు ఎవరు… అంటు తమ్ముళ్ళపై మండిపడ్డారు. ఒక దశలో మాటలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పలువురు ఇరువర్గాలను శాంతింపచేశారు. దీనిపై కమిషనర్‌ మున్సిపాలిటి తరపున చించివేసిన బ్యానర్లను మళ్లీ ఏర్పాటు చేయిస్తామని హామి ఇవ్వడంతో సమస్య తగ్గింది. కాగా తెలుగుదేశం అంతర్గత విబేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరడం, ఈ విబేదాలకు కమిషనర్‌ను పావుగా వాడుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లెయింది.

Tags: Telugu Desam factional struggle in Punganur