November 28, 2026
Explore
నడకమార్గంలో మెట్లపూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు తీసుకోవాలి

నడకమార్గంలో మెట్లపూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు తీసుకోవాలి

November 28, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి

తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గంలో మెట్ల పూజకు నాణ్యమైన పసుపు, కుంకుమ వినియోగించేలా చర్యలు చేపట్టాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో శనివారం టీటీడీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలిపిరి వద్ద పూజ సామాగ్రి విక్రయాల్లో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నడక మార్గంలో భక్తులు జారిపడకుండా నాణ్యమైన పసుపు, కుంకుమను మాత్రమే విక్రయించేలా నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పారు. ఈ మేరకు సూచిక బోర్డుల ఏర్పాటు చేసి విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో టీటీడీ ఎస్ఈ-2 వేణు గోపాల్, ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, తిరుపతి మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: Measures should be taken to ensure that high-quality turmeric and vermilion (kumkum) are used for the ‘metla puja’ (worship of the steps) along the walkway.