పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీవీరాంజనేయస్వామి వారి వార్షిక బ్రహ్మో త్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఆలయ అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులను అలంకరించి పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మోక్కులు చెల్లించుకున్నారు.
Tags; Brahmotsavams Conclude