November 27, 2026
Explore
డిసెంబర్ నుంచి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు!

డిసెంబర్ నుంచి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు!

November 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రేషన్ కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

🔹 కిలో కందిపప్పు – రూ.100
🔹 లీటర్ పామాయిల్ – రూ.125

కందిపప్పు, పామాయిల్‌ను కలిపి రూ.225కే రేషన్ షాపుల ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. డిసెంబర్ నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న ధరల మధ్య రేషన్ కార్డుదారులకు ఊరట కలిగించే నిర్ణయం.

Tags: Essential commodities at lower prices starting from December!