November 27, 2026
Explore
ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో భారీ చోరీ.. రూ.12 లక్షల సరుకులు మాయం!

ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో భారీ చోరీ.. రూ.12 లక్షల సరుకులు మాయం!

November 27, 2026 | Andhra Pradesh

హైదరాబాద్‌ముచ్చట్లు:

హైదరాబాద్‌లోని సూరారం లక్ష్మీనగర్‌లో ఉన్న ఫ్లిప్‌కార్ట్ హబ్‌లో భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. సంస్థ నిర్వహించిన అంతర్గత ఆడిట్‌లో సుమారు రూ.12 లక్షల విలువైన వస్తువులు మాయమైనట్లు గుర్తించారు.

డెలివరీ చేయాల్సిన వస్తువులను గమ్యస్థానాలకు చేర్చకుండా దారి మళ్లించి సొంతానికి వినియోగించినట్లు బీహార్‌కు చెందిన డెలివరీ బాయ్ మహమ్మద్ జియావుల్‌పై ఆరోపణలు వచ్చాయి.

నిందితుడి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, వాచ్‌లు, దుస్తులు సహా పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై ఫ్లిప్‌కార్ట్ హబ్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రమేష్, బాలసూర్య, సంజయ్ అనే మరో ముగ్గురి పాత్రపైనా పోలీసులు విచారణ చేపట్టారు.

సంస్థకు చెందిన వస్తువులను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Tags: Major theft at Flipkart hub; goods worth Rs 12 lakh go missing!