అమెరికా ముచ్చట్లు:
అగ్రరాజ్యన్ని భారీ వర్షాలు, తుపాను గాలులు అతలాకుతలం చేశాయి
థాంక్స్ గివింగ్’ పండుగ రోజున
అమెరికాలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు, బలమైన గాలులు, వరదలు అతలాకుతలం చేశాయి.
ఈ ప్రతికూల వాతావరణం కారణంగా పండుగ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు, అనేక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి.
ఇవాళ ఉదయం నాటికి ముఖ్యంగా తూర్పు తీర రాష్ట్రాల్లో 9 లక్షలకు పైగా ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వర్జీనియా, మిస్సోరీ, న్యూయార్క్ వంటి రాష్ట్రాల్లో వేలాది మంది ప్రజలు చీకట్లో చిక్కుకున్నారు.
తుపాను ప్రభావం రవాణా వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది.
ఫ్లెట్ అవేర్ సమాచారం ప్రకారం,
అమెరికాకు వచ్చే.. అక్కడి నుంచి బయలుదేరే 2,200కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి,
అలాగే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి.
మరోవైపు, న్యూయార్క్తోని మాన్హాట్టన్ మధ్య బలమైన గాలులు వీస్తున్న నేపథ్యంలో, భారీ బెలూన్ల భద్రత దృష్ట్యా ఏటా జరిగే మేసీస్ ‘థాంక్స్ గివింగ్ డే’ పరేడ్ను శనివారానికి వాయిదా వేశారు.
వర్షాలు, అలల ధాటికి తీర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ థాంక్స్లోవింగ్ రోజున రికార్డు స్థాయిలో 1.82 అంగుళాల వర్షపాతం నమోదైంది.
న్యూజెర్సీలోని మార్గేట్ సిటీలో హై టైడ్ కారణంగా వీధుల్లోకి వరద నీరు చేరగా, కాలిఫోర్నియాలో భారీ అలల ధాటికి పసిఫికా పియర్ కొంత భాగం కొట్టుకుపోయింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, వరద ముంపు ప్రాంతాలు, వాతావరణ హెచ్చరికల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు, స్థానిక పోలీసులు సూచించారు.
Tags: Storm rocks America; daily life brought to a standstill by floods