November 27, 2026
Explore
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

November 27, 2026 | Andhra Pradesh

పల్నాడుముచ్చట్లు:

నవంబర్ 29న 5 మండలాల్లో 53 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

534 పోలింగ్ కేంద్రాలు,53 కౌంటింగ్ కేంద్రాలు

194 అత్యంత సమస్యాత్మక, 82 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల లో ప్రత్యేక నిఘా.

సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ..

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కృతిక శుక్ల.

పల్నాడు జిల్లా లో ఈ నెల 29న జరగనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా,స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కృతిక శుక్ల తెలిపారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ రెండవ దశలో నవంబర్ 29వ తేదీన 5మండలాల్లోని 53 గ్రామ పంచాయతీలకు ,540 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రక్రియనుపర్యవేక్షించేందుకు కెమెరా సదుపాయం కల్పించామని తెలిపారు.ఇప్పటికీ 1144 వార్డులు ,98 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని 53 గ్రామా పంచాయతీలకు ఎన్నికలునిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి సిద్ధం

రెండవ విడత ఎన్నికల నిర్వహణకు 641 మంది ప్రిసైడింగ్ అధికారులు, 641 మంది ఏపీఓ లు , 446మంది ఇతర పోలింగ్ అధికారులు కలిపి మొత్తం 1728 మంది సిబ్బందిని రిజర్వుతో సహా నియమించినట్లు తెలిపారు.

పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు

ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టిన భద్రతా ప్రణాళికను చేపట్టారు . సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు, నిరంతర నిఘా, అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ సమన్వయంతో పనిచేస్తుందని వివరించారు.

ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ప్రజలు, ఓటర్లు సహకరించాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Tags: All arrangements completed for the second phase of Gram Panchayat elections