పుంగనూరుముచ్చట్లు:
వేసవిప్రారంభం కావడంతో దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటుందని ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని సీఐ సుబ్బరాయుడు సూచించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఇండ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే ఇల్లు వదిలి బయటకు వెళ్లే సమయంలో బలమైన తాళాలు వేసి వెళ్లాలన్నారు. సెలవుల్లో ఎక్కువ కాలం బయటకు వెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఇరుగుపొరుగు వారికి చెప్పి వెళ్లాలన్నారు. ఇంట్లో విలువైన బంగారు, వెండి నగలు , నగదు పెట్టరాదని సూచించారు. రాత్రి సమయాల్లో ఇంటి బయట నిద్రించే వారు ఇంటి తాళాలు జాగ్రత్తగా వేయాలన్నారు. దొంగతనాలను నివారించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అత్యవసర సమయాల్లో 112కు కాల్ చేయాలని కోరారు.
Tags:Observe Precautions During Summer — CI Subbarayudu