November 27, 2026
Explore
కడుపునొప్పి తగ్గుతుందని పసిబిడ్డకు వాతలు.. అమానుష చర్య!

కడుపునొప్పి తగ్గుతుందని పసిబిడ్డకు వాతలు.. అమానుష చర్య!

November 27, 2026 | Andhra Pradesh

మహబూబ్‌నగర్‌ ముచ్చట్లు:

మహబూబ్‌నగర్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. పసిబిడ్డకు కడుపునొప్పి తగ్గుతుందనే నెపంతో చిన్నారి కడుపుపై వాతలు పెట్టారు.

ఇలాంటి మూఢనమ్మకాలు, ప్రమాదకరమైన నాటు వైద్య పద్ధతులతో చిన్నారుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతలు పెట్టడం వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

చిన్నారులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మూఢనమ్మకాలను నమ్మకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ శేఖర్ వీడియో ద్వారా అవగాహన కల్పించారు

ఆ పసిబిడ్డ ఎంతటి నొప్పిని భరించిందో! మూఢనమ్మకాల పేరుతో చిన్నారులపై ఇలాంటి ప్రయోగాలు చేయడం ఎంతవరకు సమంజసం?

Tags: Branding an infant with hot objects to ‘cure’ a stomachache—an inhumane act!