November 27, 2026
Explore
బీమా లేని వాహనాలకు ఇంధనం బంద్: కేంద్రం.!

బీమా లేని వాహనాలకు ఇంధనం బంద్: కేంద్రం.!

November 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశంలో రోడ్డు భద్రతను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టంలో కీలక మార్పులకు సిద్ధమైంది.

ఇన్సూరెన్స్ బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం సరఫరా నిలిపివేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది.

సుప్రీంకోర్టు కమిటీ సూచన మేరకు, అటొమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా వాహన బీమా వివరాలను తనిఖీ చేసి, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోనున్నారు.

దీనిని ముందుగా హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు తరువాత దేశమంతా అమలు చేయనున్నారు.

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు..

Tags: No fuel for uninsured vehicles: Centre!