అమరావతిముచ్చట్లు:
తెలుగు చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగ కళాకారులకు శుభవార్త. 2017 నుండి 2025 వరకు పెండింగ్లో ఉన్న నంది అవార్డులను ప్రదానం చేయడానికి ఏపీ ప్రభుత్వం అధికారికంగా అనుమతినిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కార వేడుకను వచ్చే డిసెంబర్ నెలలో విజయవాడ లేదా అమరావతి వేదికగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అవార్డుల ప్రక్రియ తిరిగి ప్రారంభం కావడంతో సినీ కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags: AP government gives the green signal for pending Nandi Awards