పుంగనూరు ముచ్చట్లు:
భీమగానిపల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వెంకటప్రసాద్ పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటర్లను మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, సీసీ రోడ్లు, శ్మశానవాటికకు రహదారి వంటి సమస్యలను పరిష్కరించి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పుంగనూరు తొలి ఎమ్మెల్యే బాడాల కృష్ణమూర్తి మనవడిగా తనను ఆదరించి, బుట్ట గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్, హేమంత్, జగదీష్, అరుణ్, వేమారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Vote for the ‘basket’ symbol and ensure victory: Venkataprasad