పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు మండలంలో ఈనెల 29న జరగనున్న సర్పంచ్ ఎన్నికల నేపధ్యంలో డిఐజి కోయప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిల్లి లు పలు పోలింగ్ కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐజి కోయప్రవీణ్ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతవారణంలో , పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద తగిన సంఖ్యలో పోలీస్ బలగాలను మోహరిస్తామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐలు అన్సర్‌బాషా, కెవి.రమణ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: DIG and SP inspect polling stations