November 27, 2026
Explore
ఓటరు లిస్టు సవరణకు 15 చివరి గడువు

ఓటరు లిస్టు సవరణకు 15 చివరి గడువు

November 27, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఓటరు జాబితా సవరణ పక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటిస్తున్నామని పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తహశీల్ధార్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఎలక్టోరల్‌ ఫారములు పంపిణీ, సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 31 వ తేదీ వరకు చేపడుతామని తెలిపారు. అభ్యంతరాల పరిష్కార పక్రియకు డిసెంబర్‌ 15వ తేదీ చివరి గడువు అని ఆయన తెలిపారు.

Tags: 15th is the final deadline for voter list revision