పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని హైస్కూల్‌వీధిలో గల శ్రీ చైతన్య పాఠశాల సమీపంలో శుక్రవారం ఉదయం ఇనుప విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే స్పందించి విద్యుత్‌అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం అధికారులు అక్కడికి చేరుకుని కొత్త విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ సహాయ కార్యక్రమంలో ధర్మతేజ, అప్రోజ్, మధు పాల్గొన్నారు.
Tags: Electricity pole collapses – disaster averted