November 24, 2026
Explore
భీమగానిపల్లె సర్పంచ్‌ అభ్యర్థి ప్రచారంలో ముందంజ

భీమగానిపల్లె సర్పంచ్‌ అభ్యర్థి ప్రచారంలో ముందంజ

November 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని మేజర్‌ పంచాయతీ అయిన భీమగానిపల్లెలో వైఎస్సార్‌సిపి మద్దతు అభ్యర్థి చల్లా అమరావతి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. మంగళవారం పంచాయతీకి చెందిన యువకులు ఇంటింటికి వెళ్లి సర్పంచ్‌ అభ్యర్థి అమరావతికి మంచం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేశారు. వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అడగడం పలువురిని ఆకుట్టుకుంది. ఏ ఇంటికి వెళ్లినా మీకే ఓటు వేస్తాం అంటు అమరావతి కి ఓటర్లు తెలపడంతో అమరావతి గెలుపు ఇక లాంచనమేనని పంచాయతీ మేదావులు చర్చించుకుంటున్నారు.

Tags: Bhimaganipalle Sarpanch candidate leads the campaign