November 24, 2026
Explore
కరాటేలో విద్యార్థుల ప్రతిభ

కరాటేలో విద్యార్థుల ప్రతిభ

November 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని పులినాడు కరాటే అకాడమి ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు వివిధ పథకాలు సాధించారు. మంగళవారం అకాడమి డైరెక్టర్‌ సదాశివ మాట్లాడుతూ సోమవారం పాలకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో పట్టణానికి చెందిన జశ్వంత్‌, కె.మోక్షిజ్ఞ లు అండర్‌-14లో సిల్వర్‌ మెడల్‌ సాధించారన్నారు. అలాగే అండర్‌-19 లో తేజేష్‌కుమార్‌, మహేష్‌నాయక్‌లు బ్రాంజ్‌మెడల్‌ సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు.

Tags: Students’ talent in karate