పుంగనూరుముచ్చట్లు:
పుంగనూరు వ్యవసాయశాఖ పరిధిలోని రైతులందరు రబి సీజన్ పంటలకు భీమా చేసుకోవాలని ఏడి శివకుమార్ కోరారు. మంగళవారం ఆయన వివిధ మండలాల ఏవోలు, ఆర్‌ఎస్‌కె సిబ్బందితో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు రబి సీజన్‌లో టమోటా, మామిడి, వేరుశెనగ పంటలకు భీమా చేసుకునేందుకు డిసెంబర్ 15 నుంచి 31 వరకు గడువు ఉందన్నారు. టమోటా పంటకు ఎకరాకు రూ.1600 లు, మామిడి పంటకు ఎకరాకు రూ.2,250 లు , వరి పంటకు రూ.196లు, వేరుశెనగ పంటకు రూ.96 లు చెల్లించుకోవాలన్నారు. రైతులు ఈ పంట నమోదు చేసుకుని , సంబంధిత రైతు సేవా కేంద్రాల ద్వారా భీమా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌సి ఏవో రామకృష్ణంరాజు, ఏవోలు రాధ, జోత్స్నరాణి, సుధాకర్, మోహన్ తో పాటు హార్టికల్చర్ ఆఫీసర్ హరిప్రసాద్ , సిబ్బంది టిఏ జ్యోతి పాల్గొన్నారు.
Tags: To get insurance for crops