November 24, 2026
Explore
నూతన వధువరులను ఆశీర్వధించిన మాజీమంత్రి పెద్దిరెడ్డి

నూతన వధువరులను ఆశీర్వధించిన మాజీమంత్రి పెద్దిరెడ్డి

November 24, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

నూతన వివాహా వేడుకల్లో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పాల్గొని వధువరులను ఆశీర్వధించారు. ఆయన తొలుత పట్టణంలోని వైఎస్సార్‌సిపి నాయకుడు ఎంఎం.ఆనంద ఇంటికి వెళ్లి ఆయన కుమారై ఆశీర్వదించారు. అలాగే మండలంలోని ఉలవలదిన్నెలో గల మాజీ సర్పంచ్‌ సుబ్రమణ్యం ఇంటికి వెళ్లి వారి కుమారై, వారి కుమారుడిని ఆశీర్వదించారు. అలాగే పట్టణంలోని ఎస్‌విజి బోర్‌వెల్స్ చంద్రమోహన్‌ ఇంటికి వెళ్లి వారిని కలిశారు. అలాగే మండలంలోని ప్రసన్నయ్యగారిపల్లెకి వెళ్లి గంగిరెడ్డి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా పలువురికి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Former Minister Peddireddy blessed the newlywed couple