పుంగనూరుముచ్చట్లు:
కార్తీకమాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పట్టణ సమీపంలోని గూడూరుపల్లెలో వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పౌర్ణమి పూజలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, మండలంలోని ఏడూరు వద్ద వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పౌర్ణమి పూజలు నిర్వహించి, సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పౌర్ణమి సందర్భంగా ఆలయాలలో భక్తుల రాకతో సందడి నెలకొంది.

Tags: Karthika Pournami Rituals