తమిళనాడు ముచ్చట్లు:
తమిళనాడులో ఓ కీచక ఎమ్మెల్యే లైంగిక వేధింపుల బండారం బట్టబయలు అయింది. అతడు వేధింపుల బారిన పడ్డ మహిళ ఎవరో కాదు.. సాక్షాత్ జిల్లా కలెక్టర్. దీంతో ఇప్పుడు అధికార పార్టీ టీవీకే ఇరకాటంలో పడింది. ముఖ్యమంత్రి విజయ్ కు సంకట ఈ సమస్యగా మారింది. కలయికురుచ్చి జిల్లా కలెక్టర్ పద్మజకు, అరుల్ విగ్నేష్ అనే ఓ ఎమ్మెల్యే జ నేరుగా మెసేజ్ లు పెట్టడం మొదలు పెట్టాడు. మీరు చాలా బాగుంటారు, చీరగట్టితే బాగుంటుంది, మీ హెయిర్ స్టైల్ బాగుంటుంది, మీ మాట బాగుంటుంది.. అంటూ మెసేజ్ లు పెట్టడం మొదలు పెట్టడంతో జిల్లా కలెక్టర్ నేరుగా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అతడు పై మహిళా వేధింపుల చట్టం కింద కేసు కూడా నమోదయింది. హైకోర్టు కూడా ప్రభుత్వం న్యాయవాదిని పిలిపించి , ఈ కేసు విషయమై సమగ్రమైన నివేదిక తమకు అందించాలని ఆదేశించింది. ప్రతిపక్ష డిఎంకె పార్టీ నాయకుడు స్టాలిన్ కూడ తీవ్ర స్థాయిలో స్పందించారు. విజయ్ ప్రభుత్వంలో జిల్లా మహిళా జిల్లా కలెక్టర్ కె రక్షణ లేకపోతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అని ఆయన నిలదీశారు. ఇప్పుడు ఈ ఉదంతంపై తమిళనాడులో రాజకీయ దుమారం రాజుకుంది. ఎమ్మెల్యే అరుల్ విగ్నేషన్ పై ఏమి తీసుకుంటారో చూడాల్సి ఉంది..
Tags: MLA harasses Collector