చిన్నమండెం ముచ్చట్లు:
చిన్నమండెం మండలం బోనమల గ్రామంలో నిండు బాలింత రోహిణి అనుమానాస్పద మృతి…
రోహిణిని భర్త, అతని కుటుంబ సభ్యులే హత్య చేశారంటూ మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ…
తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదంటూ కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు…
గతంలో భర్తకు వివాహం జరిగిందని, అతని ప్రవర్తన సరిగా లేక మొదటి భార్య విడిచిపెట్టిందని కుటుంబ సభ్యుల వెల్లడి…
వరకట్నం, ఇతర వేధింపులతో బెంగళూరులోని పుట్టింటికి వెళ్లిన రోహిణి…
మరో వివాహం చేసుకుంటానని భర్త బెదిరించడంతో నెల రోజుల క్రితం తిరిగి భర్త వద్దకు వచ్చిన రోహిణి…
ఇటీవలే మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిణి.. .ఎనిమిది నెలల బాబును తమకు చూపించకుండా దాచిపెట్టారని కుటుంబ సభ్యుల ఆవేదన.
ఘటన అనంతరం భర్త, అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారంటూ బంధువుల ఆరోపణ.
తమ బిడ్డ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్.
ఘటనపై ఎస్ఐ సుధాకర్ వివరణ.. రోహిణి మృతి వాస్తవమేనని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడి.
ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలు వెల్లడిస్తామని ఎస్ఐ స్పష్టం….
Tags; Suspicious death of Rohini, a woman who had recently given birth