శ్రీకాళహస్తి ముచ్చట్లు:
కార్తీక పౌర్ణమి పర్వదినాన శైవక్షేత్రాలలో సాధారణంగా జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అయితే శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి సన్నిధిలో మాత్రం ప్రత్యేకమైన చొక్కాణి ఉత్సవం నిర్వహించడం ఈ క్షేత్ర విశిష్టత.
ఈ ఉత్సవంలో భాగంగా ముందుగా తాటిచెట్టును మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, కార్తీక పౌర్ణమి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్ణీత ప్రదేశంలో గుంతలో నిలబెడతారు.
సాయంత్రం అమ్మవారి సన్నిధిలో వెలిగించిన బాలదీపాలను మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, తాటిచెట్టుపై ఏర్పాటు చేసిన దీపాన్ని ప్రజ్వలింపజేస్తారు.
సాధారణ జ్వాలాతోరణ సంప్రదాయానికి భిన్నంగా, తనదైన ప్రత్యేక ఆచారంతో నిర్వహించబడే ఈ చొక్కాణి ఉత్సవం శ్రీకాళహస్తి క్షేత్ర వైభవానికి ఒక విశిష్టమైన ప్రతీకగా నిలుస్తుంది.
Tags; The unique ‘Chokkāni’ festival at the Srikalahasti shrine