November 24, 2026
Explore
ఏటీఎం చోరీ కేసులో నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు

ఏటీఎం చోరీ కేసులో నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు

November 24, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లెలో జులై 25న సీటీఎం రోడ్ శివాజీనగర్‌లో ఏటీఎం చోరీ చేసి రూ.13 లక్షలు అపహరించిన కేసులో అరెస్టైన ఇద్దరు నిందితులను మంగళవారం 2వ పట్టణ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సీఐ గోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ నాగేశ్వరరావు వారిని విచారిస్తున్నారు. నిందితులు రాజస్థాన్ డేగానా జిల్లాకు చెందిన బహదూర్ చౌకీదార్ ప్రహ్లాదరామ్ భవారి, గోపాల్ తేజరామ్ భవారి. మహారాష్ట్ర సాంగ్లీ పోలీసులు అరెస్టు చేయగా పీటీ వారెంట్‌పై మదనపల్లికి తీసుకొచ్చారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం కస్టడీలో విచారణ కొనసాగుతోంది.

Tags: Police take suspects in ATM theft case into custody