November 23, 2026
Explore
మున్సిపల్‌ పాలకవర్గం తొలి సమావేశం

మున్సిపల్‌ పాలకవర్గం తొలి సమావేశం

November 23, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు నూతన పురపాలక సంఘ పాలకవర్గ పదవి స్వీకారం సోమవారం జరిగింది. చైర్మన్‌గా నయీంతాజ్‌ బాధ్యతలు చేపట్టారు. వైస్‌ చైర్మన్‌గా దేశాది ప్రకాష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌ తో పాటు 36 మంది కౌన్సిలర్ల వద్ద ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, ఇన్‌చార్జ్ మధుసూదన్‌నాయుడు హాజరైయ్యారు.కార్యక్రమానికి పట్టణ మైనార్టీల నాయకుడు అయూబ్‌ఖాన్‌, ఆయన సోదరుడు ఇంతియాజ్‌ ఖాన్‌లు హాజరై ఎమ్మెల్యేకు, మధుసూదన్‌నాయుడుకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags; First meeting of the municipal governing body