సుండుపల్లిముచ్చట్లు:
మండలంలోని పత్తివాండ్లపల్లెలో భూ వివాదానికి సంబంధించి ఘర్షణ పడిన ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పరస్పరం కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ అమర్నాథరెడ్డి తెలిపారు.వై. రెడ్డిశేఖరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె. కృష్ణారెడ్డితో పాటు మరో ముగ్గురిపై, కె. కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వై. రెడ్డిశేఖరరెడ్డితో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
Tags: Clash over a land dispute; cases registered against both sides