రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి నియోజకవర్గంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల చివరి రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆధునిక డ్రోన్ కెమెరాలతో అణువణువూ నిఘా ఉంచారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల నిబంధనను కఠినంగా అమలు చేస్తూ, కేవలం అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (కోడ్) ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు అభ్యర్థులు, నాయకులు మరియు ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
Tags: The nomination process for the first phase of panchayat elections concluded peacefully on the final day.