November 17, 2026
Explore
పంచాయతీ రెండో దశ ఎన్నికల ప్రకటన జారీ

పంచాయతీ రెండో దశ ఎన్నికల ప్రకటన జారీ

November 17, 2026 | Andhra Pradesh

  • ఈ నెల 18 నుంచి 20 వరకు నామినేషన్ల‌ స్వీకరణ
  • 29న పోలింగ్, అదే రోజు ఫలితాలు
  • 4,960 సర్పంచ్, 49,224 వార్డు స్థానాలకు ఎన్నికలు

విజయవాడముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు 2026 కు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఈ షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ దశలో రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లోని ఎంపిక చేసిన మండలాల్లో 4,960 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించ నున్నారు. నవంబర్ 21న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. తిరస్కరించిన నామినేషన్లపై నవంబర్ 22న సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్లు చేసుకోవచ్చు. ఆ అప్పీళ్లను నవంబర్ 23న పరిష్కరించ నున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం కల్పించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నవంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనతో పాటు ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 30న రీపోలింగ్ నిర్వహించి, అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. కాగా రెండో దశ ఎన్నికల షెడ్యూల్‌లో విశాఖపట్నం జిల్లాకు ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. 3వ దశలో విశాఖపట్నం జిల్లాలో 4 మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. కోర్టు ఆదేశాలతో ఎన్నికలు వాయిదా పడిన పంచాయతీల్లో నోటీసులు జారీ చేయవద్దని.

Tags: Notification issued for the second phase of panchayat elections