November 17, 2026
Explore
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం

రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం

November 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కేంద్రం శుభవార్త అందించింది… పీఎం-రాహత్ పథకంపై ఎన్‌ఎంసీ కీలక ఆదేశాలు

పీఎం-రాహత్ పథకంలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసీ ఆదేశాలు

రోడ్డు ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స

ప్రమాదం జరిగిన నాటి నుంచి గరిష్టంగా 7 రోజుల పాటు వర్తించే పథకం

బాధితులు, సహాయకుల కోసం 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్

ఆసుపత్రుల్లో 24 గంటల ఎమర్జెన్సీ, ట్రామా కేర్ సదుపాయాలు తప్పనిసరి

రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర నగదు రహిత అత్యవసర చికిత్స అందించేందుకు ఉద్దేశించిన ‘పీఎం-రాహత్’ (PM-RAHAT) పథకంలో భాగస్వాములు కావాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆసుపత్రులను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ అధికారికంగా పబ్లిక్ నోటీసు జారీ చేస్తూ, ఆసుపత్రుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మెడికల్ కాలేజీల డైరెక్టర్లు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కోరింది.

Tags: Free medical treatment for road accident victims: