November 17, 2026
Explore
చిలకలూరిపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం.

చిలకలూరిపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం.

November 17, 2026 | Andhra Pradesh

చిలకలూరిపేట ముచ్చట్లు:

14 మంది అధికారులపై విచారణకు ఆదేశం.

చిలకలూరిపేట మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లలో నకిలీ రసీదులు జారీ చేయడం మరియు చిట్టా వసూళ్లను జమ చేయకుండా నిధులు దుర్వినియోగం చేసిన వ్యవహారంలోప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ కేసుకు సంబంధించి నాటి మున్సిపల్ కమిషనర్లు డి. రవీంద్ర, ఎస్.కె. అబ్దుల్ రహీమ్, సి.హెచ్. గోవింద రావుతో పాటు పలువురు మేనేజర్లు, అసిస్టెంట్లు,అకౌంటెంట్లు సహా మొత్తం 14 మంది అధికారులపై ఉమ్మడి శాఖాపరమైనవిచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మున్సిపల్ వ్యవహారాలు మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ దీనికి సంబంధించిన జీవోను విడుదల చేశారు. గుంటూరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ ఎస్. హరి కృష్ణనువిచారణాధికారిగా నియమించగా,ఈ విచారణను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.

Tags: Misuse of funds in Chilakaluripet Municipality.