కురబలకోట ముచ్చట్లు:
కురబలకోట మండలం అంగళ్లులో సోమవారం రాత్రి యువకుడిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. సుమారు 30 ఏళ్ల యువకుడిపై దాడి జరగడంతో తీవ్ర రక్తస్రావంతో పడిపోయాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన అతడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags; Youth attacked with knives in Angallu