అమరావతిముచ్చట్లు:
ఏ ఐ కే యం యస్ .రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమాపతి నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు….
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అడవి జంతువుల
దాడులతో కన్నీరు పెడుతున్న అన్నదాతలు…సాగుకు దూరమవుతున్న వేలాది మంది రైతులు! 🌾🐒💔
దేశ ప్రజానికానికి అన్నం పెట్టి అదుకునే అన్నదాతలకు ఏళ్ళ తరబడి నష్టాలే, ఒకవైపు పంటలపై పగటిపూట లక్షల కొద్ది అడవి కోతుల బెడదలు,మరోవైపు రాత్రి పూట వేల కొలది అడవి పందుల బడదలు,వీటికి తోడు వందల సంఖ్యలో ఏనుగుల బెడదతో వేసిన పంటలు చేతికందక,పూర్తిగా నష్టపోయి వేలాది మంది రైతులు పూర్తిగా నష్టపోయి అప్పులై అలమటిస్తున్నారని ప్రభుత్వాన్ని కోరారు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కోతులు, పందులు,ఏనుగులు,వీటి ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయని అన్నారు,అడవుల్లో చెట్లు,నీటి వనరులు తగ్గిపోవడంతో వేలకొలది గుంపులు గుంపులుగా వచ్చి గ్రామాలపై పడి ఇళ్ళలోనికి చొరబడి ధ్వంసం చేయడమే కాకుండా చంటి పిల్లలపైదాడి చేస్తున్న సమయంలో తరిమెందుకు ప్రయత్నం చేస్తున్న ప్రజలపై కూడా తిరగబడి కొరకడం వంటి విధ్వంసానికి పాల్పడుతున్నాయని తెలిపారు,ఇక్కడితో ఆగకుండా పంట పొలాలపై కూడా కోతులు రైతుల పాలిట శాపంగా మారాయని
రైతుల ఆవేదన వర్ణనాతీతంగా ఉందని చెప్పారు,రైతులు
ఎండనక,వాననక,అలుపెగక రాత్రింబవళ్లు రక్తాలు చిందించి కాయకష్టంతో అష్టకష్టాలుపడి ఆరుగాలం శ్రమించి, పంటకు లక్షలాది రూపాయలు అప్పులు చేసి పండించిన పంటలపై వేలకొలది కోతులు గుంపులుగా వచ్చి దాడి చేసి నిమిషాల్లోనే పంటలను పూర్తిగా సర్వనాశనం చేస్తున్నాయని.కొబ్బరి, మామిడి,టమేటా,వరి, అరటి,చెరకు,రాగులు, మొక్కజొన్న,వేరుశనగ, కూరగాయలు,పండ్ల తోటలు అనే తేడా లేకుండా అన్ని పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయని తెలిపారు.ఆఖరుకు పశుగ్రాసాన్ని కూడా వదలడం లేదు.
ఒకవైపు రైతులు పంటలను కాపాడుకోవడానికి రాత్రింబవళ్లు పొలాల వద్ద కాపలా కాపలా కాస్తూ
కొండముచ్చుల బొమ్మలు పెట్టినా, టపాసులు కాల్చినా, వేలకు వేలు ఖర్చు చేసి సోలార్ ఫెన్సింగ్ వేసినా కానీ కోతులు, పందులు,ఏనుగులు వీటి దాడులను నివారించలేకపోతు న్నారని అన్నారు,వీటి గురించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయక వెంటనే స్పందించి వీటిపై గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు,ఎక్కువగా మన్యం జిల్లా.చిత్తూరు జిల్లాలల్లో అడవి జంతువుల బెడదలు ఎక్కువైనాయి,అడవి సమీప ప్రాంతాల్లో పగటిపూట వేల కొలది కోతులు బెడదలు,రాత్రి పూట గుంపులవారీగా ఏనుగుల బెడదలు, వీటికి తోడు వందల సంఖ్యలో అడవి పందులబెడదలతో వేసిన పంటలు చేతికందక పూర్తిగా నష్టపోయి అప్పులై అలమటిస్తున్నారని తెలిపారు,ఏనుగుల వలన జరిగే పంట నష్టాలకు ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారాన్ని,అడవి పందులు,కోతులకు కూడా వర్తింపచేసే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రస్తుత ఉన్న జీవోను రద్దు చేసి కొత్త జీవోను వెంటనే అమలు చేయసి,పంటలవారీగా ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం పెంచి పంట నష్టమైన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని ఇప్పించాలని కోరారు,ఒకవైపున రైతులు పంట
నష్టాలను భరించలేక, వేలకు వేలు ఖర్చు చేసి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వేలాది మంది రైతులు వ్యవసాయమే మాకు వద్దని వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు,
భూములు ఉన్నా అడవి జంతువుల వలన చాలా ప్రాంతాల్లో సాగు చేయలేక బీడు భూములుగానే పెడుతున్నారని అన్నారు,ఈ విషయాన్ని
ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని కోరారు,
రైతు బాగుంటేనే రాష్ట్రమే కాకుండా దేశం బాగుంటుందని అన్నారు,కాని కోతులు, పందులు,ఏనుగులు వీటి బెడదలను కేవలం ఒక సాధారణ సమస్యగా కాకుండా,రైతుల జీవన్మరణ సమస్యగా ప్రభుత్వం వెంటనే గుర్తించి
వాటి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు,
అడవి జంతువుల దాడిలో పంట నష్టపోయి.రైతులను గాయపరచిన వారిని గుర్తించి ప్రభుత్వం తరపున నష్టపోయిన వారికి (ఆర్థికసాయం) నష్టపరిహారాన్ని రైతులకు
అందించి,
దేశ ప్రజానికానికి మూడు పూటలా అన్నం పెట్టి అదుకునే రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని,రైతన్న పడుతున్న ఈ కష్టం ప్రభుత్వ పాలకుల తెలీదా ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని,ఏ ఐ కే యం యస్,
రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. ఉమాపతి నాయుడు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు
అడవి జంతువులకు శాశ్వత పరిష్కారం: అటవీ శాఖ ద్వారా అడవుల్లోనే మర్రి, రావి,నేరేడు,రేగు వంటి పండ్ల చెట్లను విరివిగా నాటి,నీటి కుంటలను ఏర్పాటు చేసి అడవి జంతువులు పొలాల మీదకు రాకుండా సోలార్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేయాలి
కోతుల నియంత్రణ: జనావాసాల్లో,పొలాల్లో ఉన్న కోతులను పట్టుకుని తిరిగి దట్టమైన అడవుల్లోకి తరలించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటికి సంతాన నియంత్రణ చర్యల కొరకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
నష్టపరిహారం: ఏనుగులు ధ్వంసం చేస్తే ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారాన్ని ఇకపై కోతులు,పందులకు కూడా వర్తింప చేసే విధంగా కొత్త జీవోను అమలు చేయాలి
అడవి జంతువులు పంటపొలాలపైకి రాకుండా ఉండేందుకు ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి తమ భూములకు అటవి శాఖ అధికారుల ఆమోదమేరకు వంద శాతం పూర్తి సబ్సిడీతో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి



Tags:Protect the breadwinners from the clutches of wild animals,