November 1, 2026
Explore
దాడులకు, దౌర్జన్యాలకు భయపడకండి

దాడులకు, దౌర్జన్యాలకు భయపడకండి

November 1, 2026 | Andhra Pradesh

  • నిర్భయంగా వైఎస్సార్‌సిపికి ఓటు వేయండి
  • మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిలుపు

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగుదేశం ప్రభుత్వంలో ఆపార్టీ గూండాలు చేస్తున్న ఆరాచకాలకు, విధ్వంసాలకు ఎవరు భయపడకుండ ధైర్యంగా వైఎస్సార్‌సిపికి ఓటు వేయాలని మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని చదళ్ల, మంగళం పంచాయతీలలో జెడ్పిటిసి అభ్యర్థి వెంకటరమణతో పాటు ఆయా ప్రాంతాల ఎంపిటిసి అభ్యర్థులతో కలసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసి, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఓటమి చెందుతుందన్న భయంతో వైఎస్సార్‌సిపి అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండ అడ్డుకుని , దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండి పడ్డారు. పైగా నష్టపోయిన వైఎస్సార్‌సిపి కార్యకర్తలు, నాయకులపై హత్యాప్రయత్నం కేసులు పెట్టి, పోలీసులచే అరెస్ట్లు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వారికి దమ్ముంటే ఎన్నికల్లో పోరాడాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికలే లేకుండ చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్‌-6 హామీలను నేరవేర్చకుండ సూపర్‌ దాడులు చేస్తోందని ఎద్దెవ చేశారు. భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని, తెలుగుదేశం ప్రభుత్వం భూస్థాపితం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి అనీషారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Do not be afraid of attacks or acts of violence.