పుట్టపర్తి ముచ్చట్లు:
పుట్టపర్తిలో అందరి దృష్టిని ఆకర్షించిన నవ దంపతులు.. ఓటు హక్కుకు ఇచ్చిన ప్రాధాన్యతకు ప్రశంసలు..!
మున్సిపల్ ఎన్నికల వేళ పుట్టపర్తిలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వివాహమైన కొద్దిసేపటికే నవ దంపతులు పెళ్లి మండపం నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పెళ్లి దుస్తుల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.
జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన రోజే ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతను కూడా గుర్తుచేసుకున్న ఈ జంటను పలువురు అభినందిస్తున్నారు.
పెళ్లి వేడుక ఎంత ముఖ్యమో.. ఓటు హక్కు కూడా అంతే విలువైనదని తమ చర్యతో చాటిచెప్పిన నవ దంపతులు.. నిజంగా ఆదర్శప్రాయం.
Tags:Straight from the wedding venue to the polling booth..!