November 1, 2026
Explore
రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు

రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు

November 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
• రాష్ట్రంపై ప్రభావం, వర్షాలు, గాలుల అంచనాలు, జలాశయాల పరిస్థితిపై ముఖ్యమంత్రి రివ్యూ
• మరో తుఫాన్ ముప్పు నేపథ్యంలో రేపటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు
• వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుఫానుగా మారి, నవంబరు 2 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా
• నవంబరు 3న ఉదయం బాపట్ల సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం
• తీరం దాటే సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు
• మరో తుఫాను ప్రభావం నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సీఎం సమీక్ష
• నవంబరు 2న దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు. నవంబరు 3, 4 తేదీల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు
• అత్యంత భారీ వర్షాల అంచనా ఉన్న 20 మండలాల్లో ఏలూరు జిల్లాలో 9, కృష్ణాలో 5, ఎన్టీఆర్‌లో 5, బాపట్లలో ఒక మండలం
• నవంబరు 3న జిల్లా సగటు వర్షపాతం ఏలూరులో సుమారు 179 మిల్లీ మీటర్లు, కృష్ణాలో 163, ఎన్టీఆర్‌లో 161, పశ్చిమ గోదావరిలో 147, గుంటూరులో 119, బాపట్లలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండవచ్చని అంచనా
• బుడమేరు వద్ద నవంబరు 3న సుమారు 32,500 క్యూసెక్కుల ప్రవాహం రావచ్చని అంచనా. ఎర్రకాల్వ, గోనెలవాగు, జల్లేరు, పంపా తదితర జలాశయాల్లో భారీ వరదకు అవకాశం
• బలమైన గాలుల వల్ల 12 జిల్లాల్లో సుమారు 12,102 నుంచి 15,128 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు ముందస్తు అంచనా
• అర్నబ్ తుఫాన్ నష్టం, సహాయక చర్యలపై ప్రోగ్రెస్‌ను సీఎంకు వివరించిన అధికారులు
• అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణపై అధికారులతో సీఎం ఆరా
• ఈ రోజు రాత్రికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్న అధికారులు

Tags:Another cyclone threat looms over the state