రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ముగింపు సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు రాయచోటి మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అదనపు ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్ నేతృత్వంలో నామినేషన్ కేంద్రం వద్ద పోలీసు బలగాలను మోహరించారు. స్థానిక సీఐలు, ఎస్‌ఐలతో పాటు ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొన్నారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Tags:Heavy police security at the Rayachoti municipal office