ఎట్టకేలకు పోలీసు భద్రత మధ్య కడప జడ్పీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ, కాంగ్రెస్ పార్టీల మహిళా అభ్యర్థులు
వీరబల్లి ముచ్చట్లు:
వీరబల్లి మండల జడ్పిటిసి స్థానానికి వైసీపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు శుక్రవారం కడప జడ్పీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. వైసిపి నుంచి మాజీ ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి సతీమణి గాలివీటి పద్మజ, వైసిపి నాయకుడు గాలివీటి వీరనాగిరెడ్డి సతీమణి గాలివీటీ లక్ష్మిప్రియ, తాటిగుంట్లపల్లి మాజీ సర్పంచ్ గోపీనాథ్ రెడ్డి సతీమణి సాదు అనూష తోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి బొంగా భాస్కర్ రెడ్డి సతీమణి బొంగా భాగ్యమ్మ లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నరింగ్ అధికారికి అందజేశారు. వీరబల్లి జెడ్పిటిసి స్థానం అన్ రిజర్వడ్ మహిళ కు కేటాయించడంతో మహిళా నేతలు నామినేషన్ వేసేందుకు పోటీపడ్డారు. టిడిపి నుంచి రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు సతీమణి చమర్తి శోభ రాణి నామినేషన్ వేయగా, వైసీపీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు నామినేషన్ వేయడంతో వీరబల్లి మండలంలో రాజకీయం రసవర్తకరంగా మారింది. నామినేషన్ కు చివరి రోజు కావడంతో పోలీసుల భద్రత మధ్య వైసిపి, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు అతి కష్టం మీద నామినేషన్ దాఖలు చేశారు.
Tags:Three candidates from the YSRCP and one from the Congress party have filed nominations for the Veeraballi ZPTC seat.