October 18, 2026
Explore
మధ్యప్రదేశ్‌లో ఆలయంలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో ఆలయంలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది మృతి

October 18, 2026 | Andhra Pradesh

మధ్యప్రదేశ్‌ ముచ్చట్లు:

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

చినూర్ రోడ్డులో వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి పక్కనే ఉన్న షీతలా మాత ఆలయంలోకి దూసుకెళ్లడంతో 12 మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు.

ఈ దుర్ఘటనలో మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Tags: Truck crashes into temple in Madhya Pradesh; 12 people killed