అమరావతిముచ్చట్లు:
రైలు ప్రయాణికుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద నేరుగా కొనుగోలు చేసే టికెట్లకు కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులతో సమానంగా బీమా సదుపాయం కల్పించాలని ఆదేశించింది.ఈ సదుపాయాన్ని అక్టోబర్ 27 నుంచే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. అన్ని రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో విక్రయించే టికెట్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. అమల్లో విఫలమైతే రైల్వే బోర్డుదే బాధ్యత అని హెచ్చరించింది.
Tags: Insurance should be provided for railway counter tickets too – Supreme Court’s key directive