అమరావతిముచ్చట్లు:
హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివచ్చిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి కల్పిస్తున్న ఉచిత తాత్కాలిక నివాస వసతి గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ సదుపాయం 2026 జూన్ 27 నుంచి ఏడాది పాటు లేదా సీఆర్డీఏ ప్రభుత్వ నివాస గృహాలను కేటాయించే వరకు కొనసాగనుంది. ఉద్యోగుల అవసరాలు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సమర్పించిన లేఖను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Tags: Free accommodation for them in AP extended for another year