October 13, 2026
Explore
గో సంర‌క్ష‌ణ‌, జంతు ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్ద పీట‌

గో సంర‌క్ష‌ణ‌, జంతు ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్ద పీట‌

October 13, 2026 | Andhra Pradesh

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

భ‌క్తుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని ఏనుగులతో ఆశీర్వాదం నిషేధం

టీటీడీ గోశాల డైరెక్ట‌ర్ శివ కుమార్

టీటీడీలో గో సంర‌క్ష‌ణ‌, జంతు ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్ద పీట వేసిన‌ట్లు టీటీడీ గోశాల డైరెక్ట‌ర్ శివ‌కుమార్ తెలిపారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా-2 లోని మీడియా సెంట‌ర్ లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

టీటీడీ ఆల‌యాల్లో కైంక‌ర్యాల‌కు అవ‌స‌ర‌మైన పాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గోశాల ద్వారా స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌తిరో్జూ తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న ప్ర‌సాద కేంద్రానికి 15వేల లీట‌ర్ల పాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. గో సంర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు గోవుల ఆరోగ్యం ప‌ట్ల ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ తీసుకోవ‌డం జ‌రుగుతోంద‌న్నారు. టీటీడీ గోశాల ద్వారా బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో వాహ‌న సేవ‌ల ఊరేగింపున‌కు ఏనుగులు, అశ్వాలు, వృశ‌భాల‌ను ప్ర‌త్యేక అలంక‌ణ‌ల‌తో ఊరేగించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.

జంతు సంర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక వైద్య బృందాల‌తో పాటు, కేర‌ళ నుండి వైద్య బృందం, శ్రీ‌వారి వైద్య సేవ ద్వారా విచ్చేసే వైద్యులు విశేష కృషి చేస్తున్నార‌ని చెప్పారు.

ఏనుగులతో ఆశీర్వాదాలు నిషేధం:

ఏనుగుల సంర‌క్ష‌ణ‌, భ‌క్తుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని వాటితో ఆశీర్వాదాలు తీసుకోవ‌డం పూర్తిగా నిషేధించిన‌ట్లు టీటీడీ గోశాల డైరెక్ట‌ర్ శ్రీ శివ‌కుమార్ తెలిపారు. ఈ మేరకు SoP లను కూడా రూపొందించడం జరిగింది అన్నారు.

భ‌క్తులంద‌రూ ఏనుగుల‌కు దూరంగా ఉంటూ నిబంధ‌న‌లు పాటించి స‌హ‌క‌రించాల్సింగా తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌వి, పీఆర్వో కుమారి నీలిమ పాల్గొన్నారు.

Tags: Cow protection and animal protection are a big priority