October 13, 2026
Explore
ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌తో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర మ్యూజియం

ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌తో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర మ్యూజియం

October 13, 2026 | Andhra Pradesh

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

చీఫ్ మ్యూజియం ఆఫీస‌ర్ సోమ‌న్నారాయ‌ణ‌

తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర మ్యూజియంను ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాలో అభివృద్ధి చేసిన‌ట్లు చీఫ్ మ్యూజియం ఆఫీస‌ర్ సోమ‌న్నారాయ‌ణ తెలిపారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా-2 లోని మీడియా సెంట‌ర్ లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించార‌ని చెప్పారు. శ్రీ‌వారి నవ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల అనంత‌రం ట్రైల్ ర‌న్ నిర్వ‌హించిన అనంత‌రం న‌వంబ‌ర్ మొద‌టి వారంలో ఎస్వీ మ్యూజియంను భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌ని చెప్పారు.

మ్యూజియంలో మొత్తం 14 గ్యాల‌రీలు అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో రూపొందించిన బ్ర‌హ్మాండం గ్యాల‌రీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంటుంద‌ని తెలిపారు. తిరుమ‌ల చ‌రిత్ర‌ను తెలియ‌జేసేలా శిల్ప‌క‌ళ‌లు, ఆల‌య చ‌రిత్ర‌, స్వామివారి ఆభ‌ర‌ణాలు (డిజిట‌ల్), ఆయుధాలు, సంగీత వాయిద్యాలు వంటి వివిధ క‌ళా ఖండాల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచుతున్న‌ట్లు చెప్పారు. రూ.50 ధ‌ర‌ను మ్యూజియం ప్ర‌వేశ రుసుంను పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఈ టికెట్ల‌ను టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సీపీఆర్వో డాక్ట‌ర్ టి.ర‌వి, పీఆర్వో కుమారి నీలిమ, మ్యూజియం క్యూరేట‌ర్ శివ కుమార్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags: Sri Venkateswara Museum with world-class standards