మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కేంద్రంలోని ముంబై టూ చెన్నయ్ జాతీయ రహదారి, బైపాస్ రోడ్డులో యువకులు బైక్ స్టంట్లతో హల్‌చల్ చేస్తున్నారు. సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలతో, ముందు చక్రం పైకెత్తి 80-180 వేగంతో వీలింగ్ చేస్తూ జాతీయ రహదారిపై ప్రజలతో పాటు వాహణ సోదకుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాకపోకలు సాగుతున్న సమయాల్లోనూ.. పట్టణ పుర వీధుల్లో పోలీసుల ముందే అల్లరి మూకలు ఇలాంటి వీరంగాలు చేస్తుంటే, హెల్మెట్ లేకుంటే, తాగి డ్రైవ్ చేస్తుంటే ఫైన్ లు వేసే పోలీసులకు ఇవి కనిపించవా అంటూ వాహనదారులు పోలీస్ యంత్రాంగం తీరుపై మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాలు పోయాక అయినా పట్టించు కుంటారోలేదో అంటున్నారు…
Tags: Reckless bike-wheeling on Madanapalle bypass: Police turn a blind eye.