అమెరికా ముచ్చట్లు:
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు ఊరట లభించింది. అంతర్జాతీయ విద్యార్థుల వీసా గడువును నాలుగేళ్లకు కుదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధన అమలును ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా అడ్డుకుంది. ఈ నిబంధన అమలైతే అమెరికా యూనివర్సిటీలతో పాటు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సిన ఈ నిబంధనపై కోర్టు దేశవ్యాప్తంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థులకు తాత్కాలిక ఉపశమనం దక్కింది. తదుపరి విచారణ అక్టోబర్ 2న జరగనుంది.
Tags: Court stays student visa rules in the US.