పుంగనూరుముచ్చట్లు:
జిల్లా కలెక్టర్ ని కలసిన జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్..
అన్నమయ్య జిల్లా, పుంగనూరు అభివృద్ధి పనులలో భాగంగా గత ప్రభుత్వం తలపెట్టిన అనేక కార్యక్రమాలలో ప్రజలకు అసౌకర్యంగా మిగిలిన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ను కోరడం జరిగిందని జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్ అన్నారు.
డిప్యుటీ సీఎం.పవన్ కళ్యాణ్ వారు చేపట్టిన అభివృద్ధి పనులలో ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన (PMKSY) లో భాగంగా పుంగనూరు లోని పుంగమ్మ చెరువు కట్ట సుందరికరణ పనులు చేపట్టాలని,పుంగనూరు – మదనపల్లి రోడ్డును వెడల్పు చేయగలిగిన బస్సు ప్రయాణానికి ప్రజలకు బస్సు షెల్టర్ ఏర్పాటు చేయలేదని, పుంగమ్మ చెరువు కట్టపై నిర్మించిన వాకర్ ల్యాన్ పూర్తి దశకు చేరుకున్న ఇంకా నెరుపయోఘంఘ ఉన్నదని, పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ,మొక్కల పెంపకం,కట్టకి ఇరువైపులా గ్రీన్ గార్డెన్,సోలార్ ఎల్ఈడి లైట్లు, కుర్చీల ఏర్పాటు చేయాలని,ఇక్కడ ఎల్ ఈ డి లైట్లు లేకపోవడంతో కొంతవరకు యువత అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని దీనిపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో త్వరిత గతిన పనులు పూర్తి చేయించాలని కోరినట్లు ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంటనే సబ్ కలెక్టర్ కి కాన్ఫరెన్స్ నిర్వహించి సానుకూలంగా స్పందించారాని,త్వరలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటామని ఇంకా 1.5 కోటి రూపాయల లతో పార్క్ బ్యూటిఫికేషన్ పనులకు త్వరగా మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.
ఇంకా పుంగనూరు మండలం నెక్కుంది పంచాయితీ, బత్తలాపురం గ్రామం లో త్రాగు నీటి సమస్య ని కూడా కలెక్టర్ అదృష్టకి తీసుకువెళ్లడం జరిగింది అని తెలియజేశారు.
ఈ సమావేశంలో జనసేన నాయకులు రాయల్ కుమార్ తో పాటు జనసేన నాయకులు నానబాల దినేష్,ఉదయ్,వేణు ఈ టి,ప్రతాప్ కుమార్,జెన్ జి. జ్ఞానేశ్వర్ ,ఆర్టిస్ట్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Representation submitted to Collector Nishant Kumar regarding development works in Punganur.