మదనపల్లె ముచ్చట్లు:
లారీ కారును ఢీకొని కర్ణాటక వాసులు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. చింతామణి కి చెందిన నారాయణస్వామి కుటుంబీకులు తిరుమల శ్రీవారిదర్శనానికి బయలుదేరారు. కారు మార్గమధ్యంలోని మదనపల్లి మండలం, శానిటోరియం వద్దకు రాగానే విద్యుత్ ఫోన్లను తరలిస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కర్ణాటక వాసులు 5గురు తీవ్రంగా గాయపడగా, వారిని108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Tags: Car collides with lorry; Karnataka residents sustain severe injuries.