మదనపల్లె ముచ్చట్లు:
-బసినికొండ దివ్యంగురాలి దగ్గర రూ. 8 లక్షలు కాజేయడంతో రట్టైన వాణి గుట్టు..
హ్యూమన్ రైట్స్ సమస్త ముసుగులో ఘరానా మోసాలు చేస్తున్న అంగళ్లు వాణి గుట్టును మదనపల్లె బస్సులుకొండకు చెందిన ఓ బాధిత దివ్యాంగురాలు గురువారం మదనపల్లి క్లబ్ లో మీడియా ఎదుట రట్టు చేసింది. న్యాయం కోసం ఆశ్రయిస్తే సంకలో రెండు స్టిక్ లు లేనిదే నడవలేని దివ్యాంగు రాలైన తన వద్దే రూ.8 లక్షలు కాజేసిందని జ్యోతి ఆరోపించింది. అంగళ్లుకు చెందిన వాణి విడతల వారీగా డబ్బు తీసుకుని, తిరిగి ఇవ్వకుండా తననే బెదిరిస్తోందని బుధవారం ప్రెస్ క్లబ్ లో బాధితురాలు వాణి పై సంచల సంచలన ఆరోపణలు చేసింది.
వాణి పై ముదివేడు పోలీసులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగలేదని, ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధమని పేర్కొంది. నిందితురాలిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. అవసరమైతే నాకు రావాల్సిన ఎనిమిది లక్షలు కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అయితే ఘరానా మోసాలకు పాల్పడుతున్న వానిపై కఠిన చర్యలు పోలీసులు తీసుకునే వరకు పోరాటం సాగిస్తానని ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు దివ్యంగా బాధితురాలు చేసింది.
Tags: Angallu Vani is committing massive frauds under the guise of a human rights organization!