September 10, 2026
Explore
మున్సిపాలిటిలో 71 పోలింగ్‌ కేంద్రాలు

మున్సిపాలిటిలో 71 పోలింగ్‌ కేంద్రాలు

September 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 36 వార్డులలోను 71 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఈ మేరకు పోలింగ్‌ కేంద్రాల ముసాయిదాలను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోను ముసాయిదా విడుదల చేశామన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే శుక్రవారం సాయంత్రం 4 గంటలలోపు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు రెడ్డిశ్వరి, రమణారెడ్డి, టిపీవో జగదీశ్వర్‌రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags: 71 polling stations in the municipality.