September 10, 2026
Explore
తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ

తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ

September 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరులో తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. గురువారం నియోజకవర్గ నూతన ఇన్‌చార్జ్ మధుసూదన్‌నాయుడు ఏర్పాటు చేసిన ర్యాలీకి ముఖ్యఅతిధులుగా పార్టీ ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, కిషోర్‌కుమార్‌రెడ్డి, షాజహాన్‌బాషా, పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌, తంబళ్లపల్లె ఇన్‌చార్జ్ శంకర్‌ యాదవ్‌ లు హాజరై ప్రసంగించారు. ర్యాలీ తొలుత చిత్తూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై ఎంబిటి రోడ్డు, తూర్పు మొగసాల, ఇందిరాసర్కిల్‌, బస్టాండ్‌ మీదుగా గోకుల్‌ సర్కిల్‌ వరకు సాగింది. అధిక సంఖ్యలో అభిమానుల మధ్య బాణాసంచాలు పేల్చుతూ , సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గం నాయకులు దేశాదిప్రకాష్‌, సుబ్రమణ్యంరాజు, మధుసూదన్‌రాయల్‌, మాజీ బోయకొండ చైర్మన్‌ ఎస్‌కె.రమణారెడ్డి, వ్యాపారవేత్త లక్ష్మీపతిరాజు, కాపు సంఘ నాయకుడు సోమల సురేష్‌, నియోజకవర్గ న్యాయసలహాదారు వెంకటమునియాదవ్‌ లు పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారికి విందుభోజనాలు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలతో పట్టణంలో ట్రాఫిక్‌ స్తంభించడంతో సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు అన్సర్‌బాషా, రమణ, పోలీస్‌ సిబ్బంది క్రమబద్దీకరించారు.

Tags: Telugu Desam Party’s massive rally