September 5, 2026
Explore
శ్రీ శనేశ్వరస్వామికి పంచలోహ కిరీటం బహుకరణ

శ్రీ శనేశ్వరస్వామికి పంచలోహ కిరీటం బహుకరణ

September 5, 2026 | Andhra Pradesh

పుంగనూరు

పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ వద్ద వెలసియున్న శ్రీ శనేశ్వరస్వామికి శనివారం పంచలోహ కిరీటం బహుకరణగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ నాగపాళెం మెట్లవారివీధికి చెందిన అంజప్పరెడ్డి, వైజయంతిమాల దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు నవీన్‌, మధు, కుటుంబ సభ్యులు పంచలోహ కిరీటాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి కిరీటాన్ని అలంకరించారు. ఆలయ కమిటి సభ్యులు దాతలకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం చేశారు.

Tags: Presentation of a Panchaloha crown to Sri Shaneshwara Swamy.